టీఆర్ ఎస్ లో అంతర్గత వర్గ పోరు..

news02 Nov. 4, 2018, 7:54 a.m. political

harish rao

గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించడానికి మంత్రి హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారా... కేసీఆర్ ను ఓడించడానాకి హరీష్ రావు ఏంచేయాడానికైనా సిద్దమయ్యారా... కేసీఆర్ కేవలం తనయుడు కేటీఆర్‌నే ప్రోత్సహిస్తున్నారని.. తనను రాజకీయంగా ఎదగనీయడం లేదని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపోతేనే తెలంగాణలో కుటుంబ పాలన పోతుందని హరీష్ రావు తనతో చెప్పారని ఆయన అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరిందని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని మంత్రి హరీశ్‌రావు తనకు ఫోన్‌ చేసి అడిగారని ఆయన చెప్పారు. గజ్వేల్ కు  చెందిన పలువురు టీఆర్ ఎస్ కార్యకర్తలు శనివారం ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ప్రతాప్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో తనను ఎదగనీయకుండా కేవలం కొడుకు కేటీఆర్‌ను మాత్రమే కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

vanteru prathap reddy 

తనకున్న ఫాలోయింగ్‌తో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలని, ఇందుకోసం ఎటువంటి సాయం చేయాలన్నా తాను చేస్తానని హరీష్ రావు తెలిపారాడని ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నంత కాలం తనకు రాజకీయ భవిష్యత్తు లేదని హరీష్ రావు ఆవేదన చెందారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణలో కుటుంబ పాలన అంతమవుతుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారని చెప్పుకొచ్చారు. ఐతే హరీష్ రావు ప్రతిపాదనను తాను తిరష్కరించానని చెప్పిన ప్రతాప్ రెడ్డి... తన దగ్గర డబ్బు లేకపోయినా.. కార్యకర్తల బలం ఉందని.. ఈ సారి గజ్వేల్ లో తన గెలుపును ఎవ్వరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. మొత్తానికి ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు టీఆర్ ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. హరీష్ రావుకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో.. ఇప్పుడు వంటెరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలతో అది నిజమేనని తేలిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

tags: vanteru prathap reddy, vanteru prathap reddy on harish rao, vanteru prathap reddy comments on harish rao, vanteru prathap reddy about harish rao, vanteru prathap reddy comments on kcr

Related Post