వచ్చేదంతా కాంగ్రెస్ కాలమే

news02 March 9, 2018, 8:21 p.m. political

Congress huzurabad meeting

క‌రీంన‌గ‌ర్ : ముస్లీమ్స్ .. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామంటూ సీఎం కేసీఆర్‌ నాటకాలాడ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇచ్చిన హామీ అమ‌లు చేయ‌కుండా నాట‌కాలాడుతున్న కేసీఆర్ ఇకపై వారి ఓట్లు అడిగే హక్కు లేదని స్ప‌ష్టం చేవారు. . సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గురువారం ఉదయం ప్రారంభమైన ప్రజాచైతన్య బస్సు యాత్ర ముల్కనూరు .. ఎల్కతుర్తి మీదుగా కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉత్తమ్‌ మాట్లాడుతూ ముస్లింలకు 12శాతం .. గిరిజ‌నుల‌కు 10శాతం రిజర్వేషన్లను కల్పిస్తానంటూ కేసీఆర్‌ చేసిన మోసం .. కేంద్రం ప్రకటనతో బట్టబయలైందన్నారు. ఆ రెండు వర్గాల ఉసురు ఆయనకు తగులుతుందన్నారు. మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్‌ అమలు చేసిన పావలా వడ్డీ రుణాలు .. అభయహస్తం పింఛన్లు వంటి పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం నీరుగార్చిందని ఆయ‌న ధ్వజమెత్తారు.

Utham kumar reddy bis tour

డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఉత్త‌మ్ .. తమ సర్వే ప్రకారం పూర్తి మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ బస్సు యాత్ర సందర్భంగా 17 నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ ప్రభంజనమే కనిపిస్తోందన్నారు. బస్సు యాత్రకు ఎవరూ రావడం లేదన్న కేసీఆర్‌ మాటలకు హుజురాబాద్‌ సభే సమాధానం చెబుతుందని అన్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్‌ పని అయిపోందని .. రానున్న ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు మీడియా సృష్టి మాత్రమేనని .. జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఆయ‌న అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్న పీసీసీ చీఫ్ .. కేసీఆర్ ను ప్రజలు గద్దెదించడం ఖాయమని జోస్యం చెప్పారు. సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాషను కేసీఆర్‌ బద్నాం చేస్తున్నాడని మండిపడ్డారు. సమస్యలపై ప్రశ్నించినందుకు మంద కృష్ణ, ప్రతాప్ రెడ్డిల‌ను జైల్లో పెట్టించి .. రాష్ట్రంలో అనాగరిక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వని ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు.

Utham kumar reddy fire on cm kcr

షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముస్లిమ్ .. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బిల్లుకు సవరణలు చేస్తారా..? లేక సుప్రీం కోర్టుకు వెళ్తారా..? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌ సభలో టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో మహిళా నేతలు కేక్‌ కట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ ఖుంటియా మహిళా గ్యాలరీలోకి వెళ్లి.. శుభాకాంక్షలు తెలిపారు.

Related Post