కర్ణాటకలో ఇంట్రెస్ట్ రాజకీయం

news02 May 15, 2018, 5:34 p.m. political

Who is cm for karnataka

కర్ణాటక : కర్ణాటక రాజకీయాలు నిమిషనిమిషానికి మారుతున్నాయి. బిజెపికి 104 సీట్లు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవటంతో ఆఛాన్స్ ను కాంగ్రెస్ తీసుకుంది. 37 సీట్లు వచ్చిన జేడీఎస్ తో కలిసి 78 సీట్లున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.

Kumara swamy yaddurappa

జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఇచ్చిన స్నేహ హస్తాన్ని అందిపుచ్చుకున్న జేడీఎస్.... ప్రభుత్వ ఏర్పాటు కు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కూడా రాజ్ భవన్ కు వెళ్ళారు.త మకు గెలిచిన 104 సీట్లతో పాటు జేడీఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యే ల మద్దతు ఉందని చెబుతున్నారు. అదే నిజమైతే బీజేపీ బలం 104+12=116 కు చేరుతుంది.

మారుతున్న పరిణామాలతో ఎవరు ముఖ్యమంత్రి అవుతార్నది ఆసక్తి కరంగా మారింది. ఒక వేళ జేడీఎస్ లో చీలిక వస్తే కాంగ్రెస్, జేడీఎస్ ల కలయిక కూడా మ్యాజిక్ ఫిగర్ ను దాటదు. బీజేపీకి తాము మద్దతిచ్చినా కుమారా స్వామి ముఖ్య మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాని తమను సంప్రదించకుండా జేడీఎస్ ఎమ్మెల్యేతో బీజీపీ నేతలు సంప్రదింపులు జరుగుతుండటంతో కాంగ్రెస్ కు మద్దతియ్యక తప్పటం లేదని అంటున్నారు. దీంతో ఇన్ని పరిణామాల మధ్య  ఎవరు ముఖ్య మంత్రి అవుతారన్నది ఆసక్తి కరంగా మారింది.  

tags: Yaddurappa, karnataka result 2018, kumaraswamy, siddaramayya, karnataka governar, devegouda, karnataka cm.

Related Post