సొంత పార్టీ ఎంపి లను ఓడించి కసి తీర్చుకునేందుకు సిద్దమవుతున్న ఎమ్మెల్యేలు

news02 Feb. 15, 2019, 7:10 p.m. political

MLA s Vs MP s in TRS

 

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ టిఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది పార్టీ అధిష్టానం ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపేందుకు ఎంత ప్రయత్నం చేసినా విజయవంతం కావడం లేదు. సిట్టింగ్ ఎంపీలకే టికెట్ ఇస్తే లోక్సభ ఎన్నికల్లో వారిని ఓడించి తీరుతామని ఎమ్మెల్యేలు శపథం చేస్తున్నారు.

ముందు నుంచే ఎంపీలకు.. ఎమ్మెల్యేలకు మధ్య పడటం లేదు. గత ప్రభుత్వంలోనే ఎంపీలపైనా ఎమ్మెల్యేలు... ఎమ్మెల్యేల పైన ఎంపీ లు చాలా సార్లు కేసీఆర్ కు ఫిర్యాదు చేసుకున్నారు. అప్పటికప్పుడు వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసిన వారి మధ్య దూరం మాత్రం తగ్గలేదు. ఇప్పుడు సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చి వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అయితే వచ్చే లోకసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు ఎట్టి పరిస్థితిలో ను టికెట్లు ఇవ్వొద్దని తెగేసి చెబుతున్నారు ఎమ్మెల్యేలు.

TRS MP s

ఒక్కరో ఇద్దరో కాదు ఎంపీ లంటే.. వారి పరిధిలోని ఎమ్మెల్యేలకు పడటం లేదు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పలక తప్ప మిగతా ఎంపీలకు ఎంపీల పోటు తప్పేట్లు లేదు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తాము ఓడిస్తామని హైకమాండ్కు అల్టిమేటం జారీ చేస్తున్నారు ఎమ్మెల్యే లు.

TRS MLA s meeting

భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ , వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు టికెట్లు ఇవ్వవద్దని ఎమ్మెల్యేలు జిద్దు చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ పట్టుబట్టి వీరికే గనుక టిక్కెట్లు ఇస్తే ఏం చేయాలో మేము అదే చేస్తామని ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు.

MP seetharam Naik survey report

ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ ఇవ్వదని మాజీ మంత్రి తుమ్మల తో పాటు మరికొంతమంది నేతలు కూడా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమని తుమ్మల బహిరంగంగా ఆరోపిస్తున్నారు. వదిలే ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఆయనకు టికెట్ ఇస్తే ఓటమిని మూటగట్టుకోవడమే నాని జిల్లా నేతలు చెబుతున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పై కేసీఆర్ కు ఫిర్యాదులు వచ్చాయి . ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని ... ఇస్తే పార్టీ ఓడిపోతుందని కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. సీతారాం నాయక్ పై వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. సీతారాం నాయక్ కు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతా రని ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Khammam mp Ponguleti Srinivas reddy

ఎంపి , ఎమ్మెల్యేలకు మధ్య ప్యాచప్ చేసేందుకు కేసీఆర్ కేసీఆర్ లు ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కావడం లేదు. అభ్యర్థులపై ఎమ్మెల్యేలు గొంతు కాడికి కోపంతో ఊగిపోతున్నారు. టీఆర్ఎస్ 16 సీట్లలో గెలుస్తుందని ముఖ్య నేతలు చెబుతున్న.. ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ అనుమానాలు కలిగిస్తోంది.ఈ వ్యవహారం పార్టీ ముఖ్య నేతలకు తలనొప్పి తెచ్చిపెట్టింది నెల రోజుల్లోనే లోక్ సభ ఎన్నికలు జరుగుతుండడంతో వీరు మధ్య వివాదాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయని పార్టీ అధిష్టానం కలవరపడుతోంది.

tags: MP Vivek, TRS MP s, TRS MLA s, Telangana rastra samithi, cm kcr, kalvakuntla Chandra Shekhar Rao, kalvakuntla families, v6news owner, seetharam Naik, peddapalli MP, mahabubabad MP, bhuvanagiri MP, MP Kavitha, cm kcr daughter, Telangana political family, Telangana loksabha election.

Related Post