రాత్రికి రాత్రి బాబుకు ఏమైంది..

news02 March 8, 2018, 7:11 a.m. political

Am cm fire on pm modi

అమరావతి : ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ నుంచి టిడిపి ఎంపీ లను రాజీనామా చేయించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు ఎంపీలు అశోక గణపతి, రాజు, సుజనా చౌదరి లు గురువారం రాజీనామ చేస్తారని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.అరుణ్ జైట్లీ వ్యాఖ్యల్లో సహాయం చేసే ఉద్దేశ్యం కనిపించలేదని బాబు అన్నారు.అందుకేకేంద్రమంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుందని నిర్ణయించినట్లు తెలిపారు.కేంద్రం సహాయం అందిస్తుందని కేంద్ర క్యాబినెట్ లో చేరినట్లు తెలిపారు.అవి నెరవేరలేదు...అందుకే రాజీనామాల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Tdp mps in central cabinet

ప్రధాని మోడీ కి చెప్పాలని ప్రయత్నం చేసినా ... ఆయన అందుబాటులోకి రాలేదని అన్నారు. హక్కుల కోసం గట్టిగా అడుగుతున్నట్లు చెప్పారు.విభజన సమయంలో బీజేపీ కి కూడా భాగస్వామ్యం ఉందన్న బాబు.. నెత్తిన అప్పుపెట్టి రాష్ట్రాన్ని విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాని మోడీ పరిశీలిస్తాం అన్నారు తప్ప ఆ విధంగా చర్యలు శూన్యంమని అన్నారు. ఇప్పటికి కేవలం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామన్న చంద్రబాబు.. ఎన్డీయే తో తెగతెంపులపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు బాబు. కూటముల గురించి చర్చించే సమయం ఇది కాదన్నారు చంద్రబాబు.

tags: Ap cm, chandrababu , pm modi, central ministers, ap special status, cabinet resogn.

Related Post