ముస్త‌ఫా ముస్తఫా

news02 April 12, 2018, 6:41 a.m. political

congress tdp alliance

హైద‌రాబాద్ః తెలంగాణ‌లో కొత్త పొత్తులు పొడుస్తాయా..? ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ కాంగ్రెస్‌..టీడీపీలు ద‌గ్గ‌ర‌వుతున్నాయా అంటే ప‌రిస్థితులు అలాగే క‌నిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ ను గ‌ద్దె దించ‌డానికి కాంగ్రెస్..టీడీపీలు క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగాల‌న్న చ‌ర్చ రెండు పార్టీల్లోనూ జ‌రుగుతోంది. కాంగ్రెస్ ..టీడీపీలు క‌లిసి పోతాయా..  ఉత్త‌ర‌ద‌క్ష‌ణ దృవాలుగా ఉండే రెండు పార్టీల మ‌ధ్య ఈమ‌ద్య‌నే స్నేహం చిగురిస్తుండ‌టం కొత్త పొత్తుల‌కు సూచిక‌గా క‌నిపిస్తోంది.

sonia with chandrababu

బుద‌వారం రోజు గాంధీ భ‌వ‌న్ లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పొత్తుల‌పై చేసిన కామెంట్స్ కూడా కొత్త పొత్తుల‌పై చ‌ర్చ‌కు తెర‌లేపాయి. టీడీపీ తో  పెట్టుకోవద్దని లేదుగా అన్న ఉత్తం కామెంట్స్ తో పొత్తుల చ‌ర్చ‌లు ఎంత సీరియ‌స్ గా జ‌రుగుతున్న‌యో తెలుస్తోంది. తెలంగాణ లో టీడీపీ కి 10 నుంచి 12 శాతం ఓటు బ్యాంకు ఉన్న‌ట్లు వివిధ స‌ర్వేల ద్వారా తెలిసింది. ముఖ్యంగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓటర్లు టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారు. హైద‌రాబాద్ లోని సెటిల‌ర్టు అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. దీంతో పొత్తుల వ్య‌వ‌హారంలో రెండు పార్టీల నేత‌ల‌కు అభ్యంత‌రం ఏమి లేదు. ఇదే విష‌యాన్ని హైక‌మాండ్ పెద్ద‌ల‌కు వివ‌రించి నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు.

utham with tdp

తెలంగాణ టీడీపీ నేత‌లు కూడా కాంగ్రెస్ తో క‌లిసి ముందుకు న‌డిచేందుకు సంసిద్ద‌తతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి లాంటి కొంత మంది తెలుగుదేశం నేత‌లు కాంగ్రెస్ తో క‌లిసిపోతే త‌ప్పేంట‌ని బ‌హిరంగంగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ళారు. ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్యా బాబు కూడా కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబందించిన పొత్తులు ఒకే నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. చంద్ర‌బాబు ఆదేశిస్తే గాంధీభ‌వ‌న్‌, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లు క‌ల‌సిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది.

tags: tdp, congress, utham kumar reddy, chandrababu, telangana election, political alliances, rahul gandhi, pm modi, cm kcr, trs politics.

Related Post