టీఆర్ ఎస్ గెలిస్తే బానిస బతుకులే..

news02 Oct. 11, 2018, 7:53 p.m. political

uttam

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్‌.టి.సిని ప్ర‌భుత్వంలో విలీనం చేసి.. ఉద్యోగుల‌ందరికి భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆత్మీయ అభినందన సభలో ఉత్తమ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరాల జల్లులు కురిపించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ర‌వాణ సౌక‌ర్యం క‌ల్పించే ప్ర‌పంచ ప్ర‌సిద్ది చెందిన ఆర్టీసీని కేసిఆర్ నిర్ల‌క్ష్యం చేశార‌ని ఆయన మండిపడ్డారు. న‌ష్టాలు సాకుగా చూపి ఆర్టీసీని ప్రైవేట్ ప‌రం చేయాల‌ని కేసీఆర్ కుట్ర చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలో పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు పెరుగుతుంటే ఆ భారం ఆర్టీసీపై ప‌డినా కూడా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఆర్టీసీని న‌ష్టాల పాలు చేశారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. 

uttam

ఆర్టీసీ కార్మిక సంఘాల‌ను బెదిరించి భ‌య‌పెట్టే విధంగా కేసీఆర్ ఒక నియంత పాల‌న సాగించార‌ని ఉత్తమ్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యం విష‌యంలో అన్ని ర‌కాలుగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చిన ఉత్తమ్.. వారి త‌ల్లిదండ్రుల‌కు ఇత‌రుకుల ఇచ్చిన‌ట్టే పెన్ష‌న్లు ఇస్తామ‌ని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప‌రిర‌క్షించి ఉద్యోగుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు సంస్థను ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డ‌మే ప‌రిష్కార‌మ‌ని భావించామ‌ని చెప్పిన ఉత్తమ్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పనిచేస్తామని స్పష్టం చేశారు.  ఇక రాష్ట్రంలో ప్ర‌జ‌ల సొమ్ముతో అత్యంత విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్న కేసిఆర్ కుటుంబం, ప్ర‌జ‌ల‌ను మాత్రం తీవ్రంగా అణ‌చివేస్తున్నార‌ని మండిపడ్డారు ఉత్తమ్. 

uttam

అత్యంత విలువైన ప్ర‌భుత్వ భూమిలో 500 కోట్ల రూపాయ‌ల‌తో ల‌క్ష ఫీట్ల‌లో ముఖ్య‌మంత్రి ఇళ్ళు క‌ట్టుకున్నార‌న్న ఆయన.. ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్ర‌త్యేక విమానాల‌లో తిరుగుతున్నార‌ని ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయ‌ల విలువైన ప్ర‌త్యేక వాహానాల‌లో విలాసాలు చేస్తున్నార‌న్న ఉత్తమ్.. విలాసాల‌కు అల‌వాటు ప‌డిన కేసిఆర్ ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌మైన నిర్బంధంతో అణ‌చివేస్తున్నార‌ని అన్నారు. కేసీఆర్ లాంటి  నియంత‌ల‌ను ఈ సారి గెలిపిస్తే మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌ర‌న్న ఉత్తమ్.. అంతా క‌లిసి టిఆర్ ఎస్‌కు ఘోరిక‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌తి ఆర్టీసీ కార్మికుడు వంద మంది చేత టిఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయించి ఆర్టీసీని ర‌క్షించుకోవాల‌ని పిలుపునిచ్చారు. 

tags: uttam, uttam in rtc meet, uttam about rtc, uttam about tsrtc, uttam kumar reddy about rtc, uttam about rtc employes, uttam about rtc employes welfare

Related Post