లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కారు గుర్తు రద్దు చేయండి

news02 Jan. 24, 2019, 7:26 p.m. political

TRS symbal car cancel

 

హైదరాబాద్ : కార్ గుర్తు పడాల్సిన ఓట్లు ఆటో గుర్తుకు పడడంతో తమ అభ్యర్థులు కొందరు ఓడిపోయారని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈవీఎం మిషన్లలో సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు అయిన ట్రక్.. కారు గుర్తు ను పోలి ఉండటంతో తమ ఓట్లు ఆ పార్టీ కి పడ్డాయని కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కూడా కలిశారు. అయితే కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సమాజ్వాది పార్టీ అభ్యర్థి. తమకు పడాల్సిన ఓట్లు కార్ గుర్తుకు పడ్డాయని కేసీఆర్ కు రివర్స్ పంచ్ ఇచ్చారు.  లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కారు రద్దు చేయాలని లేఖ రాశారు.

Truck and car symbals in Telangana election

గద్వాలనియోజకవర్గానికి చెందిన అబ్దుల్ మహమ్మద్ ఖాన్ సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తన గుర్తు ట్రక్ కు పడాల్సిన ఓట్లు కారుకు పడడంతో నే తను ఓడిపోయిన ట్లూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కారు గుర్తును కేటాయించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ ఇచ్చారు.

tags: Cm kcr oath, cm kcr new pic, cm kcr phone number, cm kcr family, cm kcr pics, pragathibvan, Telangana bavan, Ktr new pics, Telangana governer, governer narsimhan, Telangana Raj Bhavan, Telangana election symbals.

Related Post