5 కోట్లతో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్

news02 March 7, 2018, 10:38 p.m. political

Cm kcr camp office

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఏం చేసినా స్పెషల్ ఉంటుంది.మొన్ననే 7 కోట్ల తో స్పెషల్ బస్ తయారుకేసుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన గెలిచిన గజ్వేల్ నియోజకవర్గం లో నిర్మిస్తున్న క్యాంప్ ఆఫీస్ కూడా వెరీ వెరీ స్పెషల్ గా నిలిచింది. రాష్ట్రం లోని 119 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రం లో క్యాంప్ కార్యాలయాలు కట్టిస్తున్నారు. ఒక్కొక్క కార్యాలయానికి కోటి రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. అయితే కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో నిర్మిస్తున్న క్యాంప్ కార్యాలయానికి అన్ని వసతులు హైలెట్ గా ఏర్పాటు చేస్తున్నారు. బులెట్ ప్రూఫ్ హౌజ్ గా నిర్మిస్తున్న ఈ భవనానికి మరో 50 లక్షల ఖర్చు అవుతున్నట్లు అధికారులు చెప్పారు. భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం ఇంటి చుట్టూ ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఆదనంగా 2 కోట్ల ఖర్చు అవుతోంది.

హైదరాబాద్ మినహా 104 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిలో 16 నివాసాల పనులు పూర్తయ్యాయి.మరో 31 క్వార్టర్ల పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తవుతాయి. హైదరాబాద్ లోని 15 మంది ఎమ్మెల్యేలకు హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ సముదాయం లో వసతి కల్పిస్తున్నారు. అన్నిట్లోను గజ్వేల్ బుల్లెట్ ప్రూఫ్ హౌజ్ హైలెట్ గా నిలుస్తోంది.

Related Post