తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

news02 Jan. 8, 2019, 8:14 p.m. political

babu

ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీతో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. దిల్లీలోని రాహుల్ నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత యేడాది డిసెంబర్‌ 9న దిల్లీలో విపక్షాల సమావేశానికి కొనసాగింపుగా చంద్రబాబు మరోసారి దిల్లీ పర్యటనకు వెళ్లారు. రాహూల్ గాంధీతో సమావేశంలో దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాహూల్, చంద్రబాబులు సమాలోచనలు చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి తదితరులతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 19న కోల్‌కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై నేతలతో చర్చించనున్నారు. 

tags: babu, rahul, babu meet rahul, chandra babu meet rahul, chandra babu meet rahul gandhi, rahul gandhi chandra babu meeting

Related Post