ఆమెకే టిక్కెట్ ఇచ్చిన బాబు

news03 March 19, 2019, 8:21 p.m. political

shravani

 

అనంతపురం జిల్లాలో ఇప్పుడు టీడీపీ నేతల్లో ఎవరు చూసినా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆమె ఎవరో తెలియని వాళ్లు సైతం ఆమె ఎవరని ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.. బండారు శ్రావణి. మరి ఈమె గురించి అంతగా టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుకుంటున్నారని ఆలోచిస్తున్నారు.. ఎందుకంటే అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ టిక్కెట్ ను బండారు శ్రావణికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.

shravani

అంతే కాదు శ్రావణికే టిక్కెట్ ఇవ్వాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గట్టిగా పట్టుబట్టారట. ఇంకే ముందు ఎట్టకేలకు చంద్రబాబు శిగనమల అసెంబ్లీ టిక్కెట్ ను బండారు శ్రావణికి ఇచ్చేశారు. ఇంతకీ ఆమె ఎవరని ఆశ్చర్యపోతున్నారా.. శింగనమలలో టీడీపీ సీనియర్ నాయకుడు బండారు రవికుమార్ కుమార్తెనే బండారు శ్రావణి. అదన్న మాట సంగతి. 
 

tags: shravani, bandaru shravani, tdp cndidate bandaru shravani, singanamala tdp candidate bandaru shravani, singanamala tdp shravani

Related Post