అసెంబ్లీ-లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

news02 Nov. 2, 2018, 8:42 p.m. political

surevy

తెలంగాణలో టీఆర్ ఎస్ కు ఆదరణ తగ్గిందా.. టీఆర్ ఎస్ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోందా.. ప్రజల్లో ఉన్న కేసీఆర్ బ్రాండ్ విలువు పూర్తిగా తగ్గిపోయిందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ తెలంగాణ లో తాజా పరిస్థితులపై ఓ సర్వే నిర్వహించింది. రిపబ్లిక్ సీ ఓటర్ వేరిటి నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్ ఎస్ కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయట. ఐతే ఈ సర్వే అసెంబ్లీ ఎన్నికలపై నిర్విహిందింది కాదు. వచ్చే సంవత్సరం జరగబోయే లోక్ సభ ఎన్నికల పరిస్థితిపై రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే నిర్వహించారు. 

uttam

ఇక ఈ సర్వేలో తెలంగాణలో టీఆర్ ఎస్ గ్రాఫ్ అమాంతం పడిపోయిందట. ప్రజల్లో టీఆర్ ఎస్ పార్టీపై ఉన్న నమ్మకం మెల్ల మెల్లగా తగ్గిపోయిందట. కేసీఆర్ హామీలపై జనంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చలేదని తెలంగాణ ప్రజలు మనసులో మాట చెప్పేశారట. అందుకే ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఇచ్చే హామీలను ఎలా నమ్మాలన్న అయోమయంలో పడ్డారట తెలంగాణ ప్రజలు. అందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ పట్ల తెలంగాణ ఓటర్లు అంత సానుకూలంగా ఉండరని రిపబ్లిక్ సీ ఓటర్ తేల్చి చెప్పింది.

mahakutami

అసలు విషయం ఏంటంటే.. రిపబ్లిక్ సీ ఓటర్ సర్వేలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఓటింగ్ శాతం బాగా తగ్గిపోతుందని తేలిందట. 2014 ఎన్నికల్లో 11 ఎంపీ సీట్లు గెలిచిన టీఆర్ ఎస్ కు.. రాబోవు లోక్ సబ ఎన్నికల్లో కేవలం 6 నుంచి 7 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది. ఇక కాంగ్రెస్ కూటమి 8 నుంచి 9 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక 17 లోక్ సభ స్థానాల్లో ఎంఐఎం కు ఓకటి, బీజేపీ కి మరొక ఎంపీ సీటు దక్కుతుందని సర్వేలో తేలింది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోను మహాకూటమిదే విజయమని ఇప్పటికే చాలా సర్వేల్లో తేలడం.. ఆ తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లోను టీఆర్ ఎస్ పార్టీకి వచ్చే సీట్లు అంతంతమాత్రమేనని స్పష్టమవడంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైందట. 

tags: mahakutami, republic cvoter survey, republic cvoter survey results on telanagana elections, congress will win in telangana, republic tv survey on telangana electiions

Related Post