ఎవరిని ఆడిగేదేంది.. నేను చెప్పిందే వేదం

news02 March 13, 2018, 10:50 p.m. political

Two Cong mlas expelled from.assemblyవివరణ అడిగింది లేదు.. ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకున్నది లేదు.. ఏక పక్షంగా ఇద్దరూ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ పెద్దలు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ పై దాడి జరిపారనే ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లను సభనుంచి బహిష్కరించారు.

ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్ కు, సభకు విచక్షణాధికారాలు ఉంటాయి. కాని సభ్యుల వివరణ తీసుకోవటం తప్పనిసరి. కనీసం సభలోని మిగతా పక్షాల అభిప్రాయాలైనా తీసుకోవాలి కానీ అది జరగలేదు. దేశ పార్లమెంట్ తో సహా వివిధ రాష్ట్రాల చట్ట సభల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ విచారణ కోసం కమిటీ లు వేశారు. నిజానిర్ధారణ కమిటీ లతో విచారణ జరిపించారు. లేదంటే కనీసం సభ మూడ్ నైనా పరిగణలోకి తీసుకున్నారు. కానీ తెలంగాణా సభలో అవేమి లేకుండానే సభలోనే సీనియర్ నేత జానారెడ్డి తో సహా.. మిగతా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్, ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

11 congress mlas suspend from ts assembly

ఈ చర్య పై అంత అయ్యాక విపక్షాల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ తో దోస్తీ కట్టిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ కూడా ఇదే విషయం పై సీఎం కేసీఆర్ ను నిలదీశారు. నిర్ణయానికి ముందు విపక్షాల అభిప్రాయం లేదని అన్నారు. బిజెపి నేత కిషన్ రెడ్జ్ కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత జానా రెడ్డి ని కూడా సస్పెండ్ చేసి.. ఇప్పుడు అభిప్రాయం తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. దీంతో వ్యవహారం రివర్స్ అవుతుందని భావించిన సీఎం కేసీఆర్ మిగతా పక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే దాట వేశారు.

Related Post