పవన్ గృహప్రవేశానికి చిరంజీవి..

news02 Nov. 9, 2018, 7:39 p.m. political

pawan

చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. ఇద్దరు సొంత అన్నదమ్ములే అయినా.. కలుసుకోవడం మాత్రం చాలా అరుదు. కుటుంబ పరమైన విభేదాలు కావచ్చు.. రాజకీయమైన అంశాలు కావచ్చు.. వీరిద్దరు కలిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి బిజీగా మారిన పవన్ ఒకవైపు, సైరా నర్సింహా రెడ్డి సినిమా షూటింగ్ లో చిరంజీవి మరోవైపు బిజీగా ఉన్నారు. 

chiru

ఇక ఇద్దరికి కలిసే తీరికెక్కడిది ఇదిగో ఈ పరిస్థితుల్లో అనుకోకుండా అన్నదమ్ములు కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పవన్ కళ్యాణ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఈ గృహప్రవేశానికి అన్నయ్య చిరంజీవి వచ్చారు. గృహ ప్రవేశ కార్యక్రమం ముగిశాక పవన్, చిరంజీవి ఇద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారట. తాజా రాజకీయ పరిణామాలతో పాటు.. కుటుంబ విషయాలపై వీరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. 
 

tags: pawan, pawan kalyan, chiranjeevi, pawan chiru, pawan chiranjeevi meeting, pawan kalyan new house, pawan new house ceremony

Related Post