చట్ట సభలకు వరుసగా 6 సార్లు గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

news02 May 29, 2019, 12:31 p.m. political

Utham Kumar Reddy mp

 

 

 

ఉత్తమ్ పొలిటికల్ లెజెండ్. వరుసగా ఆరుసార్లు గెలిచి పొలిటికల్ ఫీల్డ్ లో ఆయన లెజెండ్ గా నిలిచారు. ఒకసారి గెలిస్తేనే నేతలు బోలెడంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న ఈ కాలంలో వరుసగా ఆరుసార్లు ఓటమి దరిచేరకుండా విజయం వైపు అడుగులు వేశారు.అంటే ఆయన లెజెండ్ కాకుండా ఎందుకు ఉంటాడు.

1999 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1994లో కాంగ్రెస్ లో చేరిన ఉత్తం కోదాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014, 2018, 2019 లో నల్గొండ లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటి నుంచి ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీలోనే అధ్యక్షుడు స్థాయికి ఎదిగిన చరిత్ర ఉత్తమ్ ది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచిన ఎవ్వరి హవా నడిచినా.. ఏ కారు ఎంత స్పీడ్ దూసుకెళ్లిన హుజూర్నగర్ మాత్రం కాంగ్రెస్ దే.. అది ఉత్తమం ఉత్తమ్ దే నని నిరూపించుకున్నారు.

ప్రస్తుత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయుసేనలో మిగ్ 21 నడిపి దేశానికి సేవ చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తో పరిచయం... ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ పరిచయంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ ను బద్దలు కొట్టాలని చూసిన టీఆర్ఎస్.. నల్గొండ లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డి వారిని ఓటమి పాలు చేసింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటన్నిటిని పటాపంచలు చేస్తూ విజయం సాధించారు.

Utham Kumar reddy

నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలంతా భయపడుతున్న వేళ.. తాను పోటీ చేస్తానంటూ ముందుకు వచ్చి నిలబడ్డారు. పోటీ చేయడమే కాదు నల్గొండ ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోటనే అని గెలిచి నిరూపించారు. ఆయన నాయకత్వంలో పార్టీలో మరో రెండు లోక్సభ సీట్లను గెలిపించి సత్తా చూపించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పని అయిపోదు బ్రతికే ఉంది ప్రజల్లో మనసులో ఉందంటూ లోక్ సభ ఎన్నికల్లో బరిగీసి గెలిచారు.. గెలిపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Utham the lezend

పిసిసిచీఫ్ గా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి .. అధికార పార్టీ కి లొంగని నేతగా నిరూపించుకున్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న రాజకీయాలకు మరో లీడర్ అయితే ఎప్పుడో పారిపోయాయేవారని కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురత కాంగ్రెస్ పార్టీని నిలబేట్టిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఊపిరి ఆగి పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా లెజెండ్ లెజెండ్ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేజేలు పలుకుతున్నరు.

tags: Utham kumar Reddy, MP utham, nalgonda MP, utham family, utham Kumar Reddy huzurnagar, cm kcr, loksabha results 2019, TS assembly 2018 results, cm Ktr, cm kcr family, cm kcr father, cm kcr constency .

Related Post