బడ్జెట్ పై పెదవి విరిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్

news02 July 6, 2019, 11:08 a.m. political

uttam​​​​​​

ఢిల్లీ- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలను  నిరుత్సాహ పరిచిందని అన్నారు పిసిసి చీఫ్ ,నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.నిరుద్యోగులు ,
రైతులు, యువతకు కొంతైనా మేలుజరుగుతుందని ఆశించిన ఆ వర్గాలకు మోడీ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. దేశంలో రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే .. వారిలో భరోసా నింపేందుకు కేంద్రం చేసింది శూన్యమని అన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ ఎన్డీయే 1 లో గొప్పలు చెప్పిన మోడీ ప్రభుత్వం ..దానితో సాధించింది ఏంటో చెప్పలేక పోయిందన్న ఉత్తమ్ .., ఉన్న పరిశ్రమలకు తాము చేయబోయేదేంటో చెప్పలేకపోయిందని అన్నారు. పైగా పబ్లిక్ సంస్థల నుంచి కేంద్రం కొన్ని పెట్టుబడుల ఉపసంహరణ చేసుకుంటామనడం ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు. కేంద్రం ప్రచారం చేసుకుంటున్నదానికి..బడ్జెట్ లో ప్రకటించిన దానికి పొంతన కరువైందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ బడ్జెట్ ప్రజలకు పూర్తి నిరాశను మిగిల్చిందన్నారు ఉత్తమ్.

tags: uttam, pcc chief uttam, uttam comments on budget, pcc chief uttam critisize on central budget, uttam about central budget

Related Post