ముఖ్యమంత్రికి కోర్టు నోటీసులు..

news02 April 9, 2018, 8:47 p.m. political

hicourt notices to bhopal govt

భోపాల్ (నేషనల్ డెస్క్)- మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సాధువులకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ నిర్ణయానికి సంబందించి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులిచ్చింది. మూడు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది. హిందూ మతానికి చెందిన ఐదుగురు సాధువులు.. కంప్యూటర్ బాబా, భయ్యూ మహరాజ్, పండిట్ యోగేంద్ర మహంత, నర్మదానంద్ మహరాజ్, హరిహరానంద్ మహరాజ్ లకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సాధువులకు సహాయ మంత్రి హోదా ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సమాజంలో సాధువులకు ఉన్న హోదాను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాధువులకు ఏమి చేసినా విపక్షాలు యాగీ చేస్తూనే ఉంటాయని రాష్ట్ర బీజేపీ ప్రతినిధి రజ్‌నీష్ అగర్వాల్ ప్రభుత్వ చర్యను సమర్ధించడం విశేషం.

Related Post