పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు

news02 June 18, 2019, 9:06 a.m. political

VH

హైదరాబాద్ : పంజాగుట్టలో మాజీ ఎంపీ ఏఐసిసి కార్యదర్శి వి.హన్మంతరావు మరోసారి హల్ చల్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ షాపింగ్ మాల్ ఎదుట అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ తో కలిసి వీహెచ్‌ ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు. అంబేద్కర్‌ విగ్రహం తరలింపును నిరసిస్తూ వీహెచ్‌, మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళనకు దిగారు. వైఎస్‌ విగ్రహాన్ని సైతం తొలగించాలంటూ వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. పోలీస్ లు వీహెచ్‌ తో పాటు హర్షకుమార్, కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని బొల్లారం పీఎస్‌కు తరలించారు.

VH

ఈ సందర్భంగా పోలీస్ అధికారులపై వీహెచ్ మండిపడ్డారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ ను కేసీఆర్ ప్రభుత్వం అవమానిస్తోందని ధ్వజమెత్తారు. 5లక్షలు ఖర్చు చేసి తానే అంబేద్కర్ విగ్రహాన్ని చేయించినట్లు చెప్పారు. విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న సంకల్పంతో వస్తే విగ్రహాన్ని పోలీసులు తరలించడం అన్యాయమని ధ్వజమెత్తారు. విగ్రహాన్ని తిరిగి తనకు అప్పగించకపోతే వైఎస్ విగ్రహాన్ని కూడా కూల్చేస్తానని హెచ్చరించారు.

tags: V.HANMANTHA RAO,EX MP VH,AICC SECRETARY HANMANTH RAO AMBEDKAR,PANJAGUTTA,EX MP HARSHA KUMAR,KCR, TELANGANA GOVERNMENT, GANDHIBHAVAN, CONGRESS,TRS,BJP,YSR,YS RAJASHEKAR REDDY,TS POLICE,VH ARREST

Related Post