శ్రీనివాస్ కు గుండెపోటు

news02 Oct. 31, 2018, 7:20 a.m. political

jagan

తనకు ప్రాణహాని ఉందని వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు అంటున్నాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు ఇవాళ కేజీహెచ్‌కు తరలించారు. మూడో రోజు అతడిని విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్న సమయంలో చేతులు, ఛాతిలో నొప్పి ఉన్నట్టు చెప్పడంతో పోలీసులు వెంటనే అతన్ని విశాఖపట్నం కింగ్ జార్జి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ శ్రీనివాసరావుకు స్థానిక వైద్యుడు దేవుడుబాబుతో వైద్య పరీక్షలు చేయించారు. ఐతే శ్రీనివాస్ తనకు చికిత్స వద్దంటూ మొండికేశాడని.. తన అవయవాలు దానం చేస్తానని శ్రీనివాస్ చెప్పినట్టు డాక్టర్ దేవుడుబాబు తెలిపారు.  

తనకు చికిత్స అవసరం లేదన్న శ్రీనివాస్.. తన అవయవాలను దానం చేస్తానని చెప్పాడట. అంతే కాదు ప్రజలతో మాట్లాడే ఒక్క అవకాశం ఇవ్వాలని.. చెప్పాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయని శ్రీనివాస్ మీడియా తో వేడుకునే ప్రయత్నం చేశాడు.  నిందితుడు శ్రీనివాస్ ఎందుకిలా మాట్లాడుతున్నాడన్నది మాత్రం ఎవ్వరికి అంతుపట్టడం లేదు. వచ్చే నెల 2వ తేదీ వరకు  శ్రీనివాస్ ను విచారించేందుకు కోర్టు ఇచ్చిన పోలీస్‌ కస్టడీ గడువు మరో రెండు రోజుల్లో ముగియనునుంది. పోలీస్ కస్టడీ తరువాత శ్రీనివాసరావును సెంట్రల్ జైలుకు తరలించాల్సిన తరుణంలో శ్రీనివాసరావుకు ఆరోగ్య సమస్యలు తెలెత్తాయి. దీంతో తదుపరి విచారణ ఎలా కొనసాగించాలన్నదానిపై పోలీసులు ఆలోచనల్లో పడ్డారని తెలుస్తోంది. మరోవైపు జగన్ ను దాడి ఘటనకు సంబందించి విచారించేందుకు ప్రత్యేక బృందం ప్రయత్నిస్తోంది.

tags: Heart attack to Srinivas Rao, srinivas rao refused treatment, srinivas rao about jagan, srinivas rao wants talk to people, srinivas rao wants donate organs

Related Post