ఇక రాజకీయల నుంచి తప్పుకొండి..

news02 Nov. 4, 2018, 3 p.m. political

devender goud

ఇక రాజకీయాలు చేసింది చాలు పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ కు సూచించారు టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్. ఈ మేరకు దేవేందర్ గౌడ్, ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. కేసీఆర్ రాజకీయల నుంచి తప్పుకోవడం వల్ల తెలంగాణలో మరో ఉద్యమం రాకుండా నివారించినవారవుతారని దేవేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలిచ్చిన ఐదేళ్ల అధికారాన్ని పాలించడం చేతకాకు.. ఈ నాలుగున్నరేళ్ల సమయాన్ని వృధా చేశారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని లేఖలో వ్యాఖ్యానించారు. సమర్థవంతమైన యువత అందుబాటులో ఉన్నా కేసీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించలేకపోయారని దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. 

devender goud

ఇక బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని దేవేందర్ గౌడ్ లేఖలో ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అన్న అనుమానం కలిగేలా చేశారని దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కులాల పేరుతో కేసీఆర్ విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేశారని విమర్శించిన దేవేందర్ గౌడ్... కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని లేఖలో ఆకాంక్షించారు.

tags: devender goud, devender goud letter to kcr, devender goud letter to cm kcr, devender goud about kcr, devender goud comments on kcr

Related Post