అబ్బా.. కేసీఆర్ ను దెబ్బ కొట్టిన జగన్

news02 June 27, 2019, 12:06 a.m. political

Ap cm Jagan new style photos

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఝలక్ ఇచ్చారు .. అదేంటి అనుకుంటున్నారా ..? అవును.. ఇప్పడికే ఆకర్ష్ పాలిటిక్స్ పై .. అసెంబ్లీ వేదికగా .. ' తాను ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోను .. ఆలా చేస్తే ..చంద్రబాబు కు తనకు తేడా ఏముంటుంది ' ..? అని జగన్ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ గా కేసీఆర్ కు గుచ్చుకున్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతుంది. తెలంగాణాలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , ఒక టిడిపి ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆకర్ష్ పాలిటిక్స్ తో టీఆరెస్ గూటికి చెర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గులాబీ ఆకర్ష్ పథకంపై తెలంగాణాలో పలు రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు కేసీఆర్ తీరును తప్పు పడుతున్నారు ..కానీ కేసీఆర్ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన 'ఆకర్ష్ పథకాన్ని ' కొనసాగిస్తున్నారు . ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు కేసీఆర్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాయని టీఆరెస్ ఇంటా బయట కూడా చర్చ జరుగుతుంది.

నాకు -చంద్రబాబు కు తేడా ఎముంటుంది ..? అన్న జగన్ కామెంట్స్ మరవక ముందే.. జగన్ ప్రభుత్వం అమరావతి లోని కరకట్టలపై అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టడం ..కేసీఆర్ కు మరింత ఇబ్బంది కరంగా మారిందట. అదేంటి విజయవాడలోని కరకట్టలకు - కేసీఆర్ కు సంబంధమేంటి ..? అనుకుంటున్నారు కదూ.. ఆగండి అక్కడికే వస్తున్న .. తెలంగాణాలో కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే .. హైటెక్ సిటీలోని అయ్యప్ప సొసైటీ లో నిర్మాణాలు .. చెరువును ఆక్రమించుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు .. అదే హీరో కు చెందిన అన్నపూర్ణ స్టూడియో లోని ప్రభుత్వ భూమి లో ఆక్రమణలు గుర్తొస్తాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ..ఉద్యమం ఎగిసిపడేందుకు ..ఈ అక్రమాలు పెట్రోల్ కు -నిప్పులా ఉపయోగపడ్డాయి కేసీఆర్ కు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాలు ., ఎన్ కన్వేషన్ అక్రమ కట్టడాల తొలగింపు పై కేసీఆర్ కన్నెర్ర చేశారు. అంతే వేగంగా అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగి సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడే ఉన్నట్టుండి ఓ ఫైన్ డే జేసీబీలు మాయమయ్యాయి .. అధికారులు సైలెంట్ గా సైడ్ అయ్యిపోయారు.. ఇక సీఎం కేసీఆర్ నోటా మళ్ళీ ఆ కట్టడాల గురించి మాటే మాయమైంది. ఇది అటుంచితే.. ఏకంగా అక్రమాలు అన్నవి సక్రమాలుగా మారిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

ఐతేఇదే సీన్ .. ఇప్పుడు కృష్ణా నది కరకట్ట లో అక్రమ నిర్మాణాల విషయంలో రిపీట్ అయ్యింది. కేసీఆర్ లాగే జగన్ అధికారంలోకి రాకముందు ..తాను సీఎం అయితే ఈ అక్రమ కట్టడాల అంతుచూస్తానని ప్రకటించారు. అంతేకాదు సీఎం జగన్ అన్నంత పని చేశారు. కృష్ణా కరకట్ట పరిధిలో నిర్మించిన ప్రజావేదికను తనకు కేటాయించాలని సాక్షాత్తు మాజీ సీఎం చంద్రబాబు కోరినా ..జగన్ డోంట్ కేర్ అన్నాడు. అంతేకాదు ప్రజా వేదిక అక్రమ నిర్మాణం కాబట్టి కూల్చివేయసాల్సిందే .. అని హెచ్చరించడంతోపాటు .. ప్రజావేదిక ను కూల్చివేతను ప్రారంభించారు . అంతేకాదు .. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి తీరుతామని జగన్ ప్రకటించారు. సరిగ్గా ఇదే కేసీఆర్ కు ఇబ్బంది పెడుతుందట. వైఎస్ జగన్ అక్రమ కట్టడాలపై అన్నది అన్నట్టు ..చేసి చూపిస్తుంటే .. మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ ఎందుకు ..? హైద్రాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై మధ్యలోనే కాడి దించారు .? ఇలా ఈ వందల కోట్ల విలువైన అక్రమనలపై కేసీఆర్ 'చల్లని చూపుకు' కారణమేంటి ..? ఇదే ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్నలు. ఏది ఏమైనా జగన్ మొగోడురా బాబు ..అన్న డైలాగ్ మాత్రం జనంలో వినిపిస్తుంది.

tags: Cm kcr, ap cm Jagan, Krishna river, karakatta, kcr with Jagan, ap political story, cm chandrababu, tdp chandrababu tdp Nara Lokesh.

Related Post