ఏప్రీల్ లో ఆంద్రప్రదేశ్ ఎన్నికలు..

news02 Nov. 13, 2018, 10:18 p.m. political

ap election

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో.. మరో తెలుగు రాష్ట్రం ఏపీలోను త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ మాదిరిగానే ఏపీలోను కాస్త ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 30 లక్షల మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. బుధవారం నుంచి రాష్ట్రానికి దశలవారీగా వీవీ ప్యాడ్‌లు తీసుకొస్తామని సిసోడియా స్పష్టం చేశారు. ఈవీఎంల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు భెల్ కంపెనీకి పంపిస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 కోట్ల అని ఆయన పేర్కొన్నారు.

tags: ap, andhrapradesh, ap election, ap election shedule, ec about ap election, election commission about ap election, ec about andhra pradesh election

Related Post