కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా తర్వాత మొదటి సారి మీడియా తో రాహుల్ గాంధీ

news02 July 4, 2019, 3:17 p.m. political

Rahul Gandhi spoke after resignation

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు బహిరంగంగా ప్రకటించిన తర్వాత తొలిసారి రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. తాను చేస్తున్న భావజాల పోరాటాన్ని కొనసాగిస్తానని, గతంలో కన్నా 10 రెట్లు ఎక్కువ తీవ్రతతో పోరాటం చేస్తానని ఆయన వెల్లడించారు. బీజేపీ-ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం కేసు విచారణలో భాగంగా ముంబై కోర్టులో హాజరైన అనంతరం ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయడంతో తనపై దాడిని ముమ్మరం చేశారని, అయితే, ఈ దాడిని తాను ఆస్వాదిస్తున్నాని రాహుల్‌ సరదాగా పేర్కొన్నారు. నిరుపేదలు, రైతులు, కార్మికులకు తాను అండగా ఉంటానని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాజీనామాకు సంబంధించిన బుధవారం ట్విటర్‌లో పోస్టు చేసిన నాలుగు పేజీలో లేఖలో తాను చెప్పదల్చుకున్నదంతా చెప్పేశానని పేర్కొన్నారు.

tags: Rahul Gandhi, aicc president, Rahul Gandhi after resignation, soniya Gandhi, alahabad court, Delhi congress, Rajiv Gandhi, Indira Gandhi, Uthamkumar Reddy, batting vikramarka.

Related Post