టిఆర్ఎస్ తో సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

news02 July 6, 2019, 10:32 p.m. political

BJP chief amith Shah on TRS relations

హైదరాబాద్ : 

శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో బీజేపీ కోర్ కమిటీ నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లటం, ప్రజా సమస్యలపై పోరాటం, కొత్త నేతలను కలుపుకుపోవటం వంటి అంశాలపై చర్చించారు.

ఈ క్రమంలో బీజేపీ నేతలకు అమిత్ షా పలు సలహాలు, సూచనలు చేశారు. నటించకండి.. కేసీఆర్‌పై పోరాటం చేయండని నేతలకు షా ఒకింత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. "కేసీఆర్‌కు భయపడొద్దు. టీఆర్ఎస్‌తో దోస్తీ లేదు.. భవిష్యత్‌లో కూడా ఉండదు. తెలంగాణకు నెలకోసారి వస్తాను. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎన్నికల కోసం కాదు. తెలంగాణలో 51శాతం ఓట్ల కోసం పనిచేయాలి" అని ముఖ్యనేతలకు షా దిశానిర్దేశం చేశారు.

టిఆర్ఎస్ తో బిజెపి కి ఎలాంటి దోస్తాన లేదు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావింఛారు షా.​ ​కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గతం లో లాగా ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడరనీ క్లారిటీ ఇచ్చారు. ​అధికార టి.ఆర్.ఎస్ పై అగ్రసివ్ గా వెళ్లాలని బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. ​భవిష్యత్ లో టి.ఆర్.ఎస్ తో సత్ సంబంధాలు ఉండవని హామీ ఇచ్చారు. ఇకనుంచి నెలకోో సారి తాను రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు షా. ​ ​

tags: Cm kcr, pm Modi, amith Shah telangana , BJP Telangana chief, BJP president, BJP leaders , novatel hotel, banjarahills, shamshabad airport .

Related Post