సత్తా ఉంటే ఏపీలో పోటీ చేయండి

news03 March 23, 2019, 8:24 a.m. political

pawan

టీఆర్ ఎస్ నేతలు ఆంధ్రా ప్రజలను ద్రోహులని ఘోరాతి ఘోరంగా తిట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్.. ఈమేరకు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆంధ్రావాళ్లను పెద్దపెద్ద తిట్లు తిడుతుంటే మీకు పౌరుషం రాలేదా అని ప్రశ్నించిన పవన్.. గోదావరి రక్తం మీలో ప్రవహించడం లేదా అని నిలదీశారు. అటువంటి వారిని ఆంధ్రాకు ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.  ఇటువంటి అంశాలపై తాను పోరాటం చేస్తే, తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని పవన్ మండిపడ్డారు. అయినప్పటికీ  తాను వెనకడుగు వేయలేదన్న ఆయన.. ధైర్యమే తన నైజమని చెప్పారు. 

pawan

తెలంగాణలో ఆంధ్రా నాయకులు ప్రచారం చేస్తే అంగీకరించని టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడమేంటని పవన్ ప్రశ్నించారు.  టీఆర్ ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సత్తాచాటాలనుకుంటే మీ పార్టీ అభ్యర్థులను ఇక్కడ ఎన్నికల బరిలో నిలిపి ప్రచారం చేయండని పవన్ కళ్యాణ్ సూచించారు. గత ఎన్నికల్లో పవన్‌ ఎక్కడున్నారంటూ ప్రశ్నించిన టీఆర్ ఎస్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కల్పించుకోవడం అంత మంచిది కాదని వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఫ్యాక్షనిస్టులను రాళ్లతో తరిమికొట్టారని పవన్ గుర్తు చేశారు.

tags: pawan, pawan kalyan, pawan fire on kcr, pawan kalyan fire on cm kcr, pawan challenge to kcr, pawan kalyan challenge to kcr, pawan challenge to trs, pawan kalyan challenge to trs leaders

Related Post