వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

news02 Oct. 31, 2018, 4:23 p.m. political

rahul

రానున్న రోజుల్లో రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని మాజీ ప్రధాని దేవే గౌడ అన్నారు. రాహుల్‌ ప్రధాని అయ్యేందుకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు. 130 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్‌ పార్టీకి నేడు ఏఐసీసీ అధ్యక్షుడుగా రాహుల్‌ వ్యవహరించడం గర్వకారణమని దేవే గౌడ అన్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో ఆయన అపారమైన రాజకీయ అనుభవం పొందడం విశేషమన్నారాయన. కేంద్రలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశభవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు దేవే గౌడ. 

rahul

ఇక చంద్రబాబు తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం మంచి నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కూడా టీడీపీ పార్టీతో మహాకూటమిగా ఏర్పడితే బావుంటుందని దేవే గౌడ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవే గౌడ.. రాహూల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నఆయన.. రాహూల్ ను ప్రధానిగా చూడాలి ఉందని చెప్పారు. రాహూల్ ను ప్రధానిగా బలపరిచేందుకు జేడీఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని దేవేగౌడ స్పష్టం చేశారు. 
 

tags: rahul, rahul gandhi, deve gouda, deve gouda about rahul, deve gouda about rahul gandhi, deve gouda comments on rahul gandhi, deve gouda about mahakutami

Related Post