నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

news02 Oct. 30, 2018, 8:20 a.m. political

lalitha

వైఎస్ జగన్ పై దాడి కేసులో తాను ఇచ్చిన మెడికల్ రిపోర్టుమీద తప్పుడు ప్రచారం చేశాయని విశాఖ అపోలో మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ కె.లలితా స్వాతి వాపోయింది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఉండగానే జగన్ పై దాడి జరిగిందని, తొందరగా రావాలంటూ కొంతమంది పరుగున తనవద్దకు వచ్చారని ఆమె చెప్పింది. వెంటనే నేను స్టెతస్కోప్, బీపీ మెషిన్ తీసుకుని అక్కడకు వెళ్లానని చెప్పిన లలిత... జగన్ చొక్కా రక్తంతో తడిసిపోగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ చేశాని చెప్పుకొచ్చింది. ప్రధమ చికిత్స కంటే మించి జగన్ కు మరే చికిత్స చేయలేదని లలిత తెలిపింది. 

jagan

జగన్ బుజానికి దాదాపు 0.5 సెంటిమీటర్ల కత్తి దిగి ఉండవచ్చునని ప్రాథమిక అంచనాకు వచ్చానట్లు ఆమె చెప్పింది. అదీ కూడా పోలీసు అధికారులు త్వరగా చికిత్స చేయాలని ఒత్తిడి చేయడంతోనే తాను చికిత్స అందించానని చెప్పింది. గాయం లోతు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చని తాను భావించానని, కానీ కొందరు ఆ రిపోర్టును పట్టుకుని తప్పుడు ప్రచారం చేశారని ఆవేధన వ్యక్తం చేసింది. జగన్ బుజానికి అయిన గాయం లోతు కేవలం 0.5 సెంటిమీటర్లు మాత్రమే ఉంటుందని తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని డాక్టర్ లలిత స్పష్టం చేసింది.

tags: lalitha, jagan, dr lalitha, dr lalitha about jagan, dr lalitha about jagan treatment, dr lalitha on jagan treatment, lalitha about ys jagan

Related Post