సీఎం లే రోడ్డెక్కితే...

news02 Feb. 14, 2019, 10:58 a.m. political

CMS hungry on governers

పుదుచ్చేరి : కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రీ నిర‌స‌న‌గా నిన్న బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రోడ్డుపై ధ‌ర్నా చేసిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. ఇప్పుడు మ‌రో సీఎం రోడెక్కారు. పెదుచ్చేరి ప్ర‌భుత్వంపై కేంద్రం లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ తో కూల్చాల‌ని చూస్తుందంటూ.. ఆ రాష్ట్ర సీఎం నారాయ‌ణ స్వామి రోడ్డుపై భైటాయించి ద‌ర్నాకు దిగారు లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న కిర‌ణ బేడీ.. మోడి క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తుంద‌ని.. ప్ర‌జల చేత ఎన్నుకోబ‌డిన త‌మ ప్ర‌భుత్వాన్ని అస్తిర‌ప‌రిచే కుట్ర చేస్తుంద‌టూ సిఎం నారాయ‌ణ స్వామి.. త‌మ మంత్రుల‌తో క‌లిసి.. రాజ్ నివాస్ ముందు.. ధ‌ర్నాకు దిగారు. ప్ర‌భుత్వం నిర్ణ‌యాల‌ను ఆమోదించ‌కుండా.. అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఏక ప‌క్షంగా ఆర్డ‌ర్లు జారిచేస్తుంద‌ని నారాయ‌ణ స్వామి ఆరోపిస్తున్నారు. త‌క్ష‌న‌మే కిర‌ణ్ బేడీని రికాల్ చేయాల‌ని రోడ్డుపై బైటాయించిన నారాయ‌ణ స్వామికి సీపీఐ, సీపీఎం పార్టీల నేత‌లు సంఘీభావం తెలిపారు. అయితే ఏకంగా సీఎం త‌మ‌కు న్యాయం కావాలంటూ.. ఇలా రోడెక్కి నిర‌స‌న‌కు దిగ‌డం.. కేంద్ర ప్ర‌భుత్వం నిరంకుశానికి అద్దంప‌డుతుంద‌ని అంటుంది కాంగ్రెస్. మ‌రోసారి అదికారంలోకి రావ‌డానికే మోడి చేస్తున్న‌కుట్ర‌లో భాగంగానే గ‌వ‌ర్న‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని .. ఇది ప్ర‌జా స్వామ్యానికి మంచిది కాద‌ని అంటుంది. మొత్తానికి మొన్న డిల్లీ సిఎం కేజ్రీవాల్ , నిన్న బెంగాల్ సిఎం మ‌మ‌తా బెనర్జీ, నేడు పుదుచ్చేరి సీఎం నారాయ‌ణ స్వామిలు.. న్యాయం కోసం రోడ్డెక్కి నిర‌స‌న‌ల‌కు దిగ‌డం..దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

Puducheri cm dharna before at Raj bhavan

tags: Puducheri cm, governor role, contravarsy governor , narsimhan, chandrababu, upa3, Rahul Gandhi, sex scandal governor, ap last governer, Telangana governer .

Related Post