మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్..

news02 Oct. 30, 2018, 4:04 p.m. political

uttam

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ దుర్మార్గపు పాలనను అంతమొందించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ వైఎంసీఏ హాల్‌లో నిర్వహించిన ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోదీని గద్దె దింపి రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో చట్టాలు తెచ్చి క్రైస్తవులకు కుల సర్టిఫికెట్‌ ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. మోదీ, బీజేపీ కొన్ని మతాలవారిని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. బీజేపీతో కేసీఆర్‌ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని.. మోదీని కలవడానికే ఢిల్లీ వెళ్లారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

uttam

మోదీకి కేసీఆర్‌ చెంచా అన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్ల పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పాటు రూ.5 లక్షల బీమా కల్పిస్తామని తెలిపారు. ఆలయాలు, మసీదులు, చర్చిలకు ఉచిత కరెంట్‌ అందిస్తామని, అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. కేసీఆర్‌ క్రైస్తవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఒక్క ఇటుక వేయలేదని దుయ్యబట్టారు. నిరుపేద క్రైస్తవులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను కేసీఆర్‌ పండబెట్టారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రైస్తవుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్టు చెప్పారు.

tags: uttam, pcc chief uttam, uttam in christian fedaratuion meet, uttam about christians, uttam about muskims, uttam about hindus, uttam fire on cm kcr

Related Post