సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చిన మమత బెనర్జీ

news02 March 5, 2018, 5:01 p.m. political

Mamatha shock to cm kcr

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న థర్డ్ ఫ్రంట్ వ్యవహారంలోని అసలు కథ అప్పుడే బట్టబయలు అవుతోంది. థర్డ్ ఫ్రంట్ పై ప్రతిపక్షాల వాదనను బెంగాల్ లోని టెలిగ్రాఫ్ పత్రిక కథనం బలపరుస్తోంది. తను థర్డ్ ఫ్రంట్ అని ప్రకటించగానే దేశం నలుమూలాలనుంచి ఫోన్ లు వచ్చాయని సీఎం ఆఫీస్ ప్రకటించింది.. వివిధ రాష్ట్రాలలోని ప్రముఖులు సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ నుంచి మమత తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారని నిన్న సీఎం ఆఫీస్ తెలిపింది. తమ్ముడు నీ నిర్ణయం సరైనదే.. ధైర్యంగా ముందుకెళ్లు.. నీ వెనుక నేను ఉన్నానని మమత తెలిపినట్లు సీఎం కేసీఆర్ కూడా స్వయంగా ప్రకటించారు. అయితే ఇదంతా ఒక కట్టుకథగా తేలిపోయింది.

అసలు మమత సీఎం కేసీఆర్ కు కాల్ చేయలేదు. సీఎం కేసీఆరే మమత కు కాల్ చేసి మద్దతు అడిగినట్లు ప్రఖ్యాత టెలిగ్రాఫ్ వార్త పత్రిక ప్రచురించింది. సీఎం కేసీఆర్ పెట్టిన ప్రతిపాదనలను కూడా మమత వ్యతిరేకించినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేఖంగా కూటమి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే బిజెపి కి వ్యతిరేఖంగా పోరాడదాం.. కానీ కాంగ్రెస్ ను కలుపుకుపోవాలని మమత చెప్పినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బిజెపి నేతలు.. కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్నారాని ఆమె చెప్పారు. అవసరమైతే బిజెపి ని ఓడించడానికి రాజకీయ అంటరానితనంను కూడా పక్కన పెట్టి.. సిపిఎం లాంటి పార్టీలను కూడా కలుపుకు పొయ్యేందుకు సిద్ధం అని మమత తెలిపినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. 

సీఎం కేసీఆర్ ఏదో చేద్దామనికుంటే మమత రివర్స్ చెప్పిందని టెలిగ్రాఫ్ పేర్కొంది. ఇప్పటి వరకు కేసీఆర్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనికి తోదు తెలంగాణ లోని ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది ఈ కథనం. కేసీఆర్ అబద్దాలకోరు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఈ కథనాన్ని అస్త్రంగా మార్చుకున్నారు.

tags: Cm kcr, mamatha benarji, third front, pm modi, telegraph daily, Bengal news.

Related Post