కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న కాంగ్రెస్ గెలిచే 6 లోక్ సభ స్థానాలు

news02 April 18, 2019, 9:03 p.m. political

Kcr tension with mp election result

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.. ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత పరిస్థితి వేరేగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ నినాదం అయిన కారు, సారు, పదహారు, ఢిల్లీ లో సర్కారు అనే నినాదం ఎన్నికల పోలింగ్ తర్వాత బలహీన పడింది. పదహారు నినాదానికి బొక్క పడే వాతావరణం క్రియేట్ అయ్యింది. పోలింగ్ తర్వాత కూడా పదహారు సీట్లు వస్తాయి అని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నా లోలోన ఏదో భయం వెంటాడుతోంది. అందుకే లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

Utham kumar Reddy with Rahul gandhi

టీఆర్ఎస్ కు 8 నియోజక వర్గాలు కలవర పెడుతున్నాయి. అందులో రెండు బిజెపి కి అవకాశం వుంటే మిగతా ఆరు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం వుండటం కేసీఆర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, చేవెళ్ల, మల్కాజ్ గిరి, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్తులు గెలిచే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఆరు నియోజక వర్గాల్లో పోలింగ్ సరళి ఎలా వుంది. ఈ సామాజిక వర్గం ఎవరికి ఓటు వేసింది.. అసలు ఈ ఆరు నియోజక వర్గాల్లో ఎం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాల్లో వున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 

Utham family cast their votes

నల్లగొండ నియోజక వర్గంలో కొత్త అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి కి టిక్కెట్ ఇవ్వటం తో టీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేశరనే చర్చ అధికార పార్టీ లో జరుగుతోంది. టీఆర్ఎస్ లోని మంత్రి జగదీష్ రెడ్డి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ల మధ్య విభేదాలు .. కాంగ్రెస్ పార్టీ కి లాభించవచ్చనే చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచిన హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు ఒన్ సైడ్ పోలింగ్ జరిగిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసింది. దీనికి తోడు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు చెక్కు చెదరకుండా పోలింగ్ కావటం టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు. న్యూట్రల్ ఓట్లు ఎక్కువ శాతం చేతి గుర్తుకు పడటం కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కి మైనస్ అయ్యింది. 

Konda visweswar reddy

ఖమ్మం లో టీఆర్ఎస్ వర్గ విభేదాలు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరీ కి కలిసి వచ్చే అవకాశం గా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టిక్కెట్ ఇవ్వకపోవడం తో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు రేణుకా చౌదరికి ఒన్ సైడ్ పోలయ్యాయి. భువనగిరి లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి ఫాలోయింగ్ వుండటం .. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పటిష్టంగా వుండటం.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య పై ప్రజల్లో అసంతృప్తి వుండటం ..కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా మారింది.

Revanth Reddy with khaki colour cloths

చేవెళ్ల లోక్ సభ పరిధిలో అయితే కాంగ్రెస్ కు ఒన్ సైడ్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మంచి పేరు వుండటం.. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త గా రాజకీయాల్లోకి రావడం.. స్థానికులకు అయన తెలియక పోవటం కాంగ్రెస్ కు గెలిచే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మహేశ్వరం నియోజక వర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన సబితా ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్ లో చేరటం తో ప్రజలు వారి ఆగ్రహాన్ని ప్రదర్శించారు.. ఈ నియోజక వర్గం లో 70 శాతం ఓట్లు కాంగ్రెస్ కు పాలయ్యాయి. మల్కాజ్ గిరి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి సైలెంట్ ఓటింగ్ పడింది. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి కొత్త కావటం.. ప్రశ్నించే గొంతు ను గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజల్ని కదిలించడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం గా మారింది. ఈ ఆరు నియోజక వర్గాల్లో ఎం జరుగుతుందో నన్న టెన్షన్ లో వున్నారు గులాబీ బాస్.

tags: Revanth reddy, malkajgiri constency, utham Kumar Reddy, 2019 Telangana loksabha results, Cm kcr, cm kcr address, TRS new candidates for loksabha elections, konda visweswar Reddy, chevella loksabha 2018, khamma MP , renukha Chowdary, nalgonda MP, MP utham Kumar Reddy, nalgonda loksabha, Telangana loksabha results.

Related Post