విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన లోక్ సభ

news02 March 13, 2018, 1:28 p.m. political

విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ దద్దరిల్లింది. ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విభజన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు రిజర్వేషన్ల అంశంపై టీఆర్ సభ్యులు నిరసన తెలిపారు. గందరగోళ పరిస్థితి మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు.

అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ ఎంపీల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

అంతకు ముందు టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదురుగా ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

రోజుకో వేషధారణలో నిరసనలో పాల్గొంటున్న ఎంపీ శివప్రసాద్ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వేషధారణలో నిరసన తెలిపి అందరినీ ఆకర్షించారు.

tags: loksabha, sumitramahajan,mp,tdp, parliament

Related Post