కేసీఆర్ ను నేనే ఆశీర్వదించాను

news02 May 7, 2019, 7:45 p.m. political

ka paul

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు కేఏ పాల్ చెప్పారు. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలి కానీ.. ప్రపంచాన్ని జయించిన పాల్‌ తో పెట్టుకోవద్దని హెచ్చరించారు. 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి.. కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని కేఏ పాల్ తెలిపారు. ఇక కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్న పాల్.. కేటీఆర్‌కు డబ్బు, అహంకారం ఎక్కువైందని విమర్శించారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. తనతో గొడవలొద్దని.. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో నాతో కలసివస్తే.. అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దామని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. తనకు కేవలం ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్‌ను హైదరాబాద్ తీసుకొస్తానని అన్నారు. 

tags: ka paul, ka paul about kcr, ka paul on kcr, ka paul on ktr, ka paul about ktr, ka paul warned to kcr, ka paul warned to ktr

Related Post