ప‌ట్నాయ‌క్ పిల‌వ‌లేద‌ట‌

news02 April 18, 2018, 9:38 p.m. political

cm kcr meet navin patnayak

సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యవహారం రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అణా చందంగా తయారయ్యింది. మిగతా రాష్ట్రాల్లోని నేతలు ఫ్రంట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ గా లేకున్నా కేసీఆర్ వాళ్ళ మీద పఫై రుద్దుతున్నట్లు కనిపిస్తోంది. నవ్వులపాలు కాకుండా ఏదో మెయింటైన్ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారం లో ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ను కలువనున్నట్లు సీఎం కార్యాలయం నుంచి మంగళవారం అధికారిక సమాచారం ఇచ్చారు. నవీన్ పట్నాయక్ స్వయంగా తమను ఆహ్వానించాడని చెప్పుకున్నారు. దీంతో థర్డ్ ఫ్రంట్ పని స్పీడప్ అయ్యిందనే సంకేతాలు వదిలారు.

odisha cm

అంతలోనే అసలు నిజం బయటపడింది. అసలు కేసీఆర్ తనను కలువడానికి రావటం లేదని నవీన్ పట్నాయక్ బాంబ్ పేల్చాడు. పూరి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని .. దారిలో తనను కలిసేందుకు వస్తానని కేసీఆర్ అడిగినట్లు పట్నాయక్ చెప్పారు. ఇప్పటికే తమ మధ్య ఫ్రంట్ రాజకీయాల గురించి చర్చ జరిగినట్లు కేసీఆర్ కార్యాలయ అధికారులు తెలిపారు. కాని అలాంటి చర్చలు ఏవి జరగలేదని నవీన్ పట్నాయక్ స్వయంగా చెప్పారు.

 

సీఎం కేసీఆర్ కు ఫ్రంట్ రాజకీయం అచ్చిరావటం లేదు. కలకత్తా వెళ్లి సీఎం మమత బెనర్జీని కలిస్తే ఆమె కాంగ్రెస్ తోనే కలిసి వెళ్లాలని సూచించింది. మిగతా నేతలనుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు.

Related Post