జ‌లీల్ ఖాన్ ఏం చ‌దివాడో ఆయ‌న‌కే తెలియ‌దు

news02 April 14, 2018, 6:32 p.m. political

ys jagan padayatra

బీకాం లో ఫిజిక్స్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు సెటైర్లు వేశారు. పాద‌యాత్ర‌లో బాగంగా విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్ ర్యాలీలో మాట్ల‌డారు. ఇక్క‌డ ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్ చ‌దివాడ‌ట అని ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ గురించి సెటైర్ వేశారు. వైసీపీలో గెలిచి ద‌బ్బుల‌కు అమ్ముడు పోయి టీడీపీలో చేరార‌ని అన్నారు. చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోనే ఉన్నా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు మాత్రం తీర‌టం లేవ‌ని అన్నారు.

హైద‌రాబాద్ లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌ట్టిన ఫ్లై ఒవ‌ర్ ల‌ను తానే క‌ట్టాన‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకుంటున్నాడ‌ని విమ‌ర్శించారు. విజ‌య‌వాడ‌లో ఒక్క ఫ్లై ఓవ‌ర్ కూడా క‌ట్ట‌డం చాత‌కాని చంద్ర‌బాబు .. అమ‌రావ‌తిని ఎలా నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించారు. అభివృద్ధి చేయ‌రు కాని స్కాంలు చేయ‌టంతో చంద్ర‌బాబు రికార్డు సాదించార‌ని అన్నారు జ‌గ‌న్‌.  

 

Related Post