పాకిస్తాన్ పై ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది.

news02 April 27, 2019, 9:06 p.m. political

media/trump_pcEi5P9.jpg

డిల్లీ : అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు కోపం వ‌చ్చింది. వీసా గ‌డువు తీరినా.. అమెరికాలో అక్ర‌మంగా ఉంటున్న పాకిస్తానీల‌పై ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. అంతేకాదు.. వీరిని త‌మ దేశానికి ర‌ప్పించుకోవ‌డంలో పాకిస్తాన్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఉడికి పోయిన ట్రంప్ .. పాకిస్తాన్ కు ఊహించ‌ని విదంగా జ‌ల‌క్ ఇచ్చారు. పాకిస్తాన్ తీరు మార్చుకోవాల‌న్న ట్రంప్.. పాకిస్తాన్  వీసాల‌పై అంక్ష‌లు విధించారు. పాకిస్తాన్ తీరు మార‌క‌పోతే.. మొత్తానికే పాక్ వీసాలను అమెరికా నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూఎస్ చట్టం ప్రకారం.. వీసా ఆంక్షలు విధించిన పది దేశాల్లో ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ చేరింది. దేశం నుంచి బహిష్కరణకు గురైనవారు, వీసా గడువు ముగిసినవారిని తిరిగి తమ దేశానికి రప్పించేందుకు ఈ 10 దేశాలు నిరాకరిస్తుండ‌టంతో .. అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంది. 2001లో గయానా, 2016లో గాంబియా, కాంబోడియా, ఎరిట్రేయా, గుయేనియా, సియేరా లియోన్ దేశాలపై 2017, బర్మా, లావోస్ లో 2018లో వీసా ఆంక్షలు విధించిన యూఎస్ ...ఇప్పుడి లిస్ట్ లో  పాకిస్థాన్ ను చేర్చింది. వీసా ఆంక్షలపై యూఎస్ లో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ స్పందిస్తూ.. పాకిస్థానీలు అమెరికా వెళ్లడం ఇక కష్టమేనన్నారు. ఈ రాయ‌బారి వ్యాఖ్య‌లు చేస్తుంటుంటే.. పాకిస్తాన్ ప‌రిస్తితి ఎంటో అర్థం అవుతంది.

tags: america president trump, pakisthan, imran khan, visa, pakistha, us internastional effairs,

Related Post