కేసీఆర్ ఒక్క హామీనికూడా నెరవేర్చలేదు..

news02 Nov. 4, 2018, 5:22 p.m. political

pridhviraj

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసం పోయారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్‌ చవాన్‌ అన్నారు.‌ రాష్ట్రంలో కుటుంబపాలనలో నడిచిందన్న ఆయన.. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని టీఆర్ ఎస్ నేరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాడ్లాడిన పృధ్విరాజ్ చవాన్ కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనపై మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అక్రమ ఇసుక దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నేరెళ్ల ఘటనలో అమాయకులైన దళితులను అన్యాయంగా చంపారంటూ పృధ్విరాజ్ చవాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరు పేదలకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం.. ఆ హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

kcr

కేవలం కమిషన్ల కోసమే మిషన్‌ భగీరథ కొనసాగుతోందన్నార చవాన్...  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు నెలకు 3వేల రూపాయల భృతి ఇవ్వడంతో పాటు.. మహిళా స్వయం సహక సంఘాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని పృధ్విరాజ్ చవాన్ తెలిపారు. ఇక కేసీఆర్ ఏ నయా నవాబ్ అని విమర్శించిన చవాన్.. కేసీఆర్ పాలనలో తెలంగాణ రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని చెప్పిన పృధ్విరాజ్ చవాన్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవ్వగానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.  

tags: pridhviraj, pridhviraj chouhn, pridhviraj chouhan fire on kcr, pridhviraj chouhan fire on cm kcr, pridhviraj chouhan comments on kcr, pridhviraj chouhan comments on trs govt

Related Post