రఫేల్ లో 30వేల కోట్ల కుంభకోణం

news02 March 7, 2019, 7:46 p.m. political

rahul

రఫేల్‌ యుధ్ద విమానాల కుంభకోణంలో ప్రధాని మోదీని విచారించాల్సిందేనని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ డిమాండ్ చేశారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వం  సుప్రీంకోర్టుకు వెల్లడించిన నేపధ్యంలో రాహుల్‌ స్పందించారు. రఫేల్‌ పత్రాలు కన్పించకుండా పోయాయంటే అందులోని సమాచారం నిజమేనని స్పష్టమవుతోందని ఈ సందర్బంగా రాహూల్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని మోదీ జోక్యం ఉందని.. ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపారని తేలిందని చెప్పారు. 30వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తిపై మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రఫేల్‌ ఒప్పందానికి మోదీ బైపాస్‌ సర్జరీ చేశారన్న ఆయన.. అనిల్‌ అంబానీకి ప్రయోజనం చేకూర్చేందుకే కొనుగోలును ఆలస్యం చేశారని ఆరోపించారు. రఫేల్ యుధ్ద విమానాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలన్న రాహూల్.. ఇందులో భాగంగా ప్రధాని మోదీని కూడా విచారించాల్సిందేనని తేల్చి చెప్పారు. 

tags: rahul, rahul gandhi, rahul fire on pm modi, rahul fire om modi, rahul gandhi about rafale, rahul gandhi about rafale scam

Related Post