మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు మనదే

news02 July 22, 2019, 8:13 a.m. political

uttam

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని ఆయన చెప్పారు. సంగారెడ్డిలో మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ నేత షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీమ్, వంశీ చందర్ రెడ్డి, సంపత్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల, మాజీ మంత్రి గీత రెడ్డి, పీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మునిసిపల్ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ వార్డుల విభజన, రిజర్వేషన్ తప్పుల తడకగా ఉందని ఈ సందర్బంగా ఉత్తమ్ అన్నారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిందని ఆయన గుర్తు చేశారు.  జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్ ప్రక్రియ జరగాలని ఉత్తమ్ చెప్పారు. 

uttam

మునిసిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిచి టీఆర్ ఎస్ కు బుద్ది చెప్పాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని  ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ లో  బిజెపికి స్థానం లేదని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఏడు శాతం ఓట్లు మాత్రమే  వచ్చాయని ఆయన గుర్తు చేశారు. నలుగురు ఎంపీలు గెలవగానే ఆపార్టీ నేతలు  ఊహల్లో విహరిస్తున్నరని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈనెల 27, 28 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్  జెండా పండుగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంటింటికి కాంగ్రెస్, వాడవాడలా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పారు.

tags: uttam, uttam in sangareddy meeting, uttam comments in sangareddy meeting, uttam in municipal election review meeting, pcc chief in municipal election review

Related Post