బోయవాడి వేటుకు గాయపడిన కోయిల

news02 March 25, 2019, 11:36 p.m. political

Ex MP Vivek fires on cm kcr

హైదరాబాద్ : పెద్దపల్లి టికెట్ ఇవ్వని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మాజీ ఎంపి జి. వివేక్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తనను కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆరోపణలు చేసిన వివేక్. మరో మారు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. సోమవారం సీఎం కేసీఆర్ కు రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.. ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే తనకు పోటీచేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరిక్షణంలో టికెట్ నిరాకరించారని వివేక్ మండిపడ్డారు. 

Ex MP Vivek fire on cm kcr

తనపైన పెంపుడు కుక్కలను వదిలి తన మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై పోటీచేసిన వ్యక్తికి.. ఇప్పుడు ఏంపు టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిం దని అన్నారు. తన తండ్రి కాకా, తను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. తెలంగాణ కోసం పనిచేయడం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాటం చేయటమే పార్టీకి ద్రోహం చేయడమా? అని ప్రశ్నించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే నేను చేసిన ద్రోహమా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు. 2014లో టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే తను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే నేను చేసిన ద్రోహమా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టారని అన్నారు. 

 

టికెట్ హామీ ఇచ్చి చివరి క్షణం వరకు కుట్ర బయటపడకుండా.. తనను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారని ఫైర్ అయ్యారు వివేక్ . ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చిందని... ఇదే తను చేసిన ద్రోహం కావొచ్చని మండిపడ్డారు. ప్రజలకు తనను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం తనకు దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చి ఉద్యమకారులను అవమానించారని మండిపడ్డారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వపోకడలను ప్రజల మీద రుద్ధుతున్నార ని... ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తరని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా కూడా సమయం తక్కువగా ఉండడం వల్ల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు వివేక్.

tags: Ex MP Vivek, cm kcr, peddapalli loksabha candidates, peddapalli MP, Gudisela Venkata Swamy, G.vivek on cm kcr, TRS MP s list, MP candidate, peddapalli town, cm kcr wickypidea.

Related Post