మీడియా ను తన్ని తరిమేసిన సీఎం కేసీఆర్

news02 March 11, 2018, 10:04 p.m. political

Cm kcr restricted telangana state media

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి రాష్ట్రంలో మీడియా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుంటుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన పాలకులు టిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం అయిన బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ నుంచి మీడియాను తరిమేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాను భవన్ లోకి అనుమతించేది లేదని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. ఈ సమావేశం కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాకు చేదు అనుభవం ఎదురయ్యింది.

Cm kcr warning to media people

తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా భవన్ వెనుక గేటు దగ్గర వేసిన టెంటు కింద కూర్చోవాల్సి వచ్చింది. కనీసం తెలంగాణ భవన్ లోని పిఆర్వో గాని నేతలు కానీ మీడియా ప్రతినిధులను పట్టించుకోలేదు. ఏ పార్టీ ఆఫీస్ కు మీడియా వెళ్లినా మర్యాద ఇస్తారు. చివరికి తెలంగాణ ఉద్యమం టైం లోకూడ మీడియా పై ఆంక్షలు పెట్టలేదు. ఎండ వేడిఒకవైపు.. మరోవైపు ఆకలితో రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు తల్లడిల్లిపోయారు. మీడియా ప్రతినిధులు బంగారు తెలంగాణ అంటే ఇదే కావచ్చని మీడియా ప్రతినిధులు సెటైర్లు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని చూసి జర్నలిస్టులు బాధపడ్డారు.మళ్ళీ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే భవన్ పరిసరాల్లోకి కూడా మీడియాను అనుమతించరేమోనని జర్నలిస్టులు గునుక్కున్నారు.

tags: Cm kcr, telangana state media, trs office, trslp meeting, telangana bhavan.

Related Post