ఎమ్మెల్సీ ఎన్నికలను భహిష్కరిస్తున్నాం

news02 March 11, 2019, 8:59 p.m. political

uttam

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రాగానే టీఆర్ ఎస్ పార్టీ వికృత రాజకీయాలకు దిగజారిందని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో చేర్చుకోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో వారి కోరిక మేరకు టీఆర్ ఎస్ కు తాము మద్దతిచ్చామని ఈ సందర్బంగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 

uttam

కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారన్న ఉత్తమ్.. కాంగ్రెస్, టీడీపీ నేతలను టీఆర్ ఎస్ లో చేర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మండలి ఎన్నికల వ్యవహారం అంటే హుందాగా ఉండాలనన్న పీసిసి చీఫ్.. గ్రామస్థాయి ఎన్నికలకంటే పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో కేసీఆర్ కు, టీఆర్ ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ రాజరిక పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని.. ఆయన తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.

 

tags: uttam, uttam kumar reddy, pcc chief uttam kumar reddy, uttam fire on kcr, uttam fire on cm kcr, uttam about mlc elections, congress bycott mlc elections

Related Post