ప్రపంచ కప్ లో భారత్ పరాజయం

news02 Nov. 23, 2018, 8:47 a.m. sports

t20

మహిళా టీ20 ప్రపంచం కప్ లో భారత్ కు ఓటమి తప్పలేదు. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలన్న కసితో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ టీంకు ఇంగ్లండ్ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆట ప్రారంభంలోనే ఇంగ్లండ్ జట్టు బౌలర్లు చాలా తక్కువ రన్స్ కే కట్టడి చేయగా.. ఆ తరువాత బ్యాట్స్‌వుమెన్‌ జోన్స్‌(51, 42బంతుల్లో 3×4, 1×6), నటైలి (54, 43బంతుల్లో 5×4) రాణించడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్‌కు భారత్‌ 19.3ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన(34, 23బంతుల్లో 5×4, 1×6), రోడ్రిగ్స్‌(26, 26బంతుల్లో 3×4) మినహా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. 

t20

భారత్‌ చివర్లో 23 పరుగులకే ఎనిమిది వికెట్లు చేజార్చుకోవడంతో ఆట గతి తప్పింది. మొత్తం 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ప్రారంభంలో భారత్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఓపెనర్లు బిమంట్‌(1, 3బంతుల్లో), వ్యాట్‌(8, 15 బంతుల్లో) ఐదు ఓవర్లకే ఔట్‌ అయ్యారు. ఆ సమయంలో జోన్స్‌(51, 42బంతుల్లో 3×4, 1×6)తో జత కలిసిన నటైలి(54, 43బంతుల్లో 5×4) మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ మంచి ఫాం కొనసాగించింది. ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డుపై పైకి ఎగబాకారు. ఆటలో ఇంకో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా పడుతూ లక్ష్యాన్ని కుదించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో 17.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేదించిడంతో విజయం సాధించారు.

 

tags: woman t20, woman t20 world cup, woman t20 world cup match, woman t20 india vs england

Related Post