లేక‌పోతే ఆట‌గాళ్లు నీరుగారిపోతారు

news02 May 31, 2018, 12:14 p.m. sports

foot ball
రియోడీజ‌రియో: మామూలుగా ఆట‌గాళ్లెవ‌రైనా కీల‌క మ్యాచ్ ఉన్న‌ప్పుడు ఏం చేస్తారు...కాస్తా ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాలు ప‌క్క‌న పెట్టి ఆట మీదే దృష్టి పెడుతారు. అందులోనూ ఇక ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లైతే ఇక ప్ర‌త్యేకంగా చెప్పేదేముంటుంది. అన్ని వ్యాపాకాల‌ను వ‌దిలేసి క‌ప్ కొట్ట‌డ‌డంపైనే ధ్యాస పెడుతారు. అమ్మాయిలు, కుటుంబ వ్య‌వ‌హారాల‌ను అస‌లు ప‌ట్టించుకోరు. కానీ, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గ‌జం రొమారియో మాత్రం ఆట‌గాళ్ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌ల‌హా ఇచ్చాడు.  సెక్స్‌లో పాల్గొన‌కుండా ఫుట్‌బాల్ మ్యాచ్ అస‌లూ ఆడొద్దంటున్నాడు. ప్ర‌పంచ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేట‌ప్పుడు  ఆట‌గాళ్లు త‌ప్ప‌క శృంగారంలో పాల్గొనాల‌ని సూచిస్తున్నాడు. 

romariyo
అంతేకాదు 1994 ఫుట్‌బాల్‌ ప్ర‌పంచ‌క‌ప్‌లో 5 గోల్స్ కొట్ట‌డానికి సెక్స్ చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నాడు. టోర్నిలో ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా శృంగారంలో పాల్గొని... కొత్త ఉత్సహాన్ని పొందన‌ని అంటున్నాడు. అందుకే ప్ర‌పంచ క‌ప్‌కు సిద్ధ‌మ‌వుతున్న బ్రెజిల్ ఆట‌గాళ్ల‌కు కూడా ఇదే స‌ల‌హాను ఇస్తున్న‌ట్లు చెబుతున్నాడు. ముఖ్యంగా బ్రెజిల్ ఫుట్ జ‌ట్టుకు హాట్ ఫెవ‌రేట్‌గా మారిన 21 ఏళ్ల గాబ్రియల్‌ జీసస్ త‌న సూచ‌న‌ను త‌ప్ప‌క పాటిస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు  విశ్వాసం వ్య‌క్తం చేయ‌డం విశేషం. 

jesus

 

tags: romariyo,fooltball,jesus,footballworld cup,brazil

Related Post