వాళ్లకో రూల్.. మాకో రూలా

news02 Sept. 1, 2018, 9:44 a.m. sports

aliez

అమెరికా (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డెస్క్)- ఆటల్లో అమ్మాయిలకో రూలు.. అబ్బాయిలకో రూలా అని ప్రశ్నిస్తోంది ఫ్రెంచ్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్. అసలు విషయం ఏంటంటే.. యుఎస్ ఓపెన్ లో కార్నెట్ జొహన్నా లార్సన్ తో టెన్నిస్ మ్యాచ్ ఆడుతోంది. ఐతే విరామంలో ఆమె తన టాప్ ను మార్చుకున్నప్పుడు సరిగ్గా ధరించలేదు. అంటే వెనుకపైవుది ముందుకు వేసుకుంది. దీంతో ఆమె మ్యాచ్ గ్యాప్ లో టెన్నిస్ కోర్టులోనే తన టాప్ ను మార్చుకుంది. 

alize

దీన్ని అంపైర్ తప్పుబట్టాడు. కార్నెట్ ను అందరి ముందు మందలించాాడు. టెన్నిస్ కోర్టులో ఇలా లోదుస్తులు కనిపించేలా టాప్ మార్చుకోవడం సరికాదని అన్నాడు. దీంతో కార్నెట్ కు చిర్రెత్తుకొచ్చింది. టెన్నిస్ కోర్టులో పరుషులు డ్రెస్ మార్చుకోవచ్చు కానీ.. మహిళలు మార్చుకోకూడదా అని ప్రశ్నించింది. నాకు లేని అభ్యంతరం మీకెందుకని కడిగేసింది. ఇక చాలా మంది క్రీడాకారులు కార్నెట్ ను సపోర్ట్ చేశారు. యుఎస్ ఓపెన్ నిర్వాహకులు సైతం కార్నెట్ ను హెచ్చరించిన అంపైర్ ను మందలించారు.

tags: alize, alize cornet, alize cornet change top in court, alize cornet fire on empire

Related Post