2020లో ఆస్ట్రేలియాలో టీ-20

news02 Jan. 30, 2019, 7:57 a.m. sports

t20

టీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఐసీసీ విడుదల చేసింది. 2020లో ఆస్ట్రేలియాలో నిర్వహించే పురుషుల, మహిళల ప్రపంచ కప్‌ టీ-20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఈ మేరకు ప్రకటంచారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌ టీమ్స్ ఉన్న కఠినమైన గ్రూప్‌-2లో కోహ్లీ సేనను చేర్చారు. ఈ గ్రూప్‌లో మొత్తం మూడు జట్లతోపాటు అర్హత సాధించే మరో రెండు జట్లు ఉండనున్నాయి. ఇక టీ-20 మ్యాచ్ లో భఆగంగా టీమిండియా దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. అటు భారత మహిళల జట్టును గ్రూప్‌ ఏలో చేర్చారు. తొలి మ్యాచ్‌లోనే భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది.

టీ-20 పురుషుల ప్రపంచకప్‌..

అక్టోబర్‌ 18 నుంచి 23 వరకు- క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌ లు

గ్రూప్‌ మ్యాచ్‌లు- అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 8 వరకు

గ్రూప్‌-1- పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, రెండు అర్హత సాధించిన జట్లు.

గ్రూప్‌-2- భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్‌, రెండు అర్హత సాధించిన జట్లు

సెమీ ఫైనల్స్‌- నవంబర్‌ 11, 12

ఫైనల్స్‌- నవంబర్‌ 15
---------------------------------------------------------

t20

టీ-20 మహిళల ప్రపంచ కప్‌ 

గ్రూప్‌ మ్యాచ్‌లు- ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు

గ్రూప్‌-ఏ- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌, శ్రీలంక, క్వాలిఫయర్‌ 1

గ్రూప్‌-బి- ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌ 2

సెమీఫైనల్స్‌- మార్చి 5

ఫైనల్‌- మార్చి 8

క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి సారి ఆస్ట్రేలియాలో మహిళల, పురుషుల టీ20 ప్రపంచ కప్‌లను ఒకే ఏడాది, ఒకే దేశంలో నిర్వహించడం విశేషం. ఈ రెండు టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌ లు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియంలో జరగనునన్నాయి.
 

tags: t20, t20 world cup, t20 world cup schedule, t20 world cup 2020 schedule

Related Post