భర్తపై సానియా కామెంట్..

news02 April 5, 2018, 9:32 a.m. sports

sania about shoib

ఢిల్లీ- టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తన భర్త.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా భర్త ఇప్పటికీ స్ప్రింగ్ చికెన్‌లా ఉంటాడు అంటూ ట్విట్టర్‌ వేధికగా స్పందించింది. ఇంకేముంది సానియా ట్వీట్‌ కి షోయబ్ అభిమానులు పెద్దఎత్తున లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. అసలేంజరిగిందంటే... ట్విట్టర్‌ లో ఓ నెటిజన్.. పాకిస్తాన్ క్రికెటర్ జట్టు సభ్యులైన షాహీన్ షా అఫ్రీది, షోయబ్ మాలిక్‌లను పోలుస్తూ ఓ పోస్ట్ చేశాడు. షాహీన్ అఫ్రీది ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో జన్మించగా.. షోయబ్ మాలిక్ అక్టోబర్ 14, 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు అంటూ ట్వీట్ చేశాడు.

sania mirza about husband

ఈ ట్వీట్ కు స్పందించిన సానియా.. ... సహజంగానే నా భర్త ఇప్పటికీ స్ప్రింగ్ చికెన్‌లా ఉంటాడు అని కామెంట్ చేసింది. సానియా ట్వీట్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వయసు సంఖ్య మాత్రమేనని, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ మాలిక్ ఇంకా జట్టులో కొనసాగుతున్నాడని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తరువాత సానియా మీర్జా ఇలా తన భర్తపై గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అసలు సానియా.. షోయబ్ మాలిక్ కలిసే అన్నారా అన్న అనుమానం చాలా మందిలో ఉంది కదా..

Related Post