పీకల్లోతు ప్రేమలో వాళ్లిద్దరు

news02 June 30, 2019, 8:30 a.m. sports

athiya shetty

ప్రముఖ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సునీల్ శెట్టి కూతురు.. నటి.. అందాల భామ అతియా శెట్టి టీం ఇండియా క్రికెట‌ర్ కె.ఎల్‌.రాహుల్‌తో ప్రేమ‌లో పడిందట. ఈ మేరకు బాలీవుడ్ వ‌ర్గాల ఒఖటే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇందుకు ఉతమిచ్చేలా అతియా శెట్టి ఫ్రెండ్‌, ప్రముఖ మోడ‌ల్ అకాంక్ష రంజ‌న్ క‌పూర్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అకాంక్ష‌తో పాటు ముద్దుగుమ్మ అతియా శెట్టి, రాహుల్ ఉన్నారు. ఇక ఈ ప్రేమ‌తో నేనెంతో సంతోషంగా ఉన్నానంటూ అకాంక్ష ఫోటోకు క్యాప్ష‌న్ కూడా  ఇచ్చింది. ఇంకేముంది అతియా, కె.ఎల్.రాహుల్ ప్రేమ‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక గతంలో హీరోయిన్స్ నిధి అగ‌ర్వాల్‌, సోనాల్ చౌహాన్‌ల‌తో కె.ఎల్‌.రాహుల్ ప్రేమ‌లో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు అతియాతో రాహుల్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నాడ‌నే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. 

athiya

tags: athiya, athiya shetty, athiya shetty with K L rahul, athiya shetty affair witk K L rahul, athiya shetty relation ship with K L rahul

Related Post