సిరీస్ 2-1తో కివీస్ వశం

news02 Feb. 11, 2019, 7:43 a.m. sports

t20

ఆస్ట్రేలియాలో తొలి సారి టెస్టు సిరీస్‌, వన్డే సిరీస్‌ అద్భుతమైన ఆటతో గెలిచింది టీమ్‌ ఇండియా. అంతే కాదు న్యూజిలాండ్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసింది కూడా. న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ గెలిస్తే టీం ఇండియా మరింత సంతృప్తిగా పర్యటనను ముగించి గర్వంగా భారత్ వచ్చేది. ఐతే న్యూజిలాండ్‌ మాత్రం టీం ఇండియాకు  ఆ అవకాశం ఇవ్వలేదు. ఆదివారం హామిల్టన్ లో ఉత్కంఠగా సాగిన చివరి మూడో టీ20లో కివీస్ జట్టు కేవలం 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. మన్రో (72- 40 బంతుల్లో 5×4, 5×6), సీఫెర్ట్‌ (43- 25 బంతుల్లో 3×4, 3×6) గ్రాండ్‌హోమ్‌ (30- 16 బంతుల్లో 3×4, 1×6) చెలరేగిపోవడంతో న్యూజిలాండ్‌ 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇక భారత్‌ 6 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయ్‌ శంకర్‌ (43- 35 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్‌ గా నిలవగా, దినేశ్‌ కార్తీక్‌ (33 నాటౌట్‌, 16 బంతుల్లో 4×6) కాస్త రాణించినా సిరీస్ మాత్రం చేజారింది.

tags: team india, t2o, t20 series, team india loss t20, india loss t20, kiwis won t20, india vs newzeland

Related Post