మాస్కో: అందరి అంచనాలు తప్పాయి. అనుకున్నదొక్కటి...అయిందొక్కటి. ఫుట్‌బాల్ ఫిపా వరల్డ్ కప్‌లో ప్రపంచ హేమాహేమీలే బోల్తా పడ్డాయి. ఫేవరేట్ అనుకున్న జట్లే నిరూత్సహ పరిచాయి. మొత్తానికి సాకర సమరంలో ఎవ్వరూ ఉహించని విధంగా ఫ్రాన్స్, క్రోయేషియా ఫైనల్ చేరుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఉత్కంఠగా సాగిన ఈఫైనల్ పోరులో ఫిపా కప్ ఫ్రెంచ్ జట్టు వశమైంది. సాకర్ జగజ్జేతగా ఫ్రాన్స్ నిలిచింది. ఇక స్టార్టింగ్‌లోనే గ్రూప్ నుంచి వైదొలుగుతుందనుకున్న పసికూన క్రొయేషియా అద్భుత ఆట తీరును ప్రదర్శించి రన్నరప్‌గా నిలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా చేసింది.
వాస్తవానికి ఈరెండు జట్లపై సాకర్ అభిమానుల్లో పెద్దగా ఆశలు లేవు. టైటిల్ పోరులో లీగ్ దశలోనో...సెమీఫైనల్లోనూ నిష్క్రమిస్తాయను కున్నారు. ఇక జర్మన్, ఇటలీ, అర్జెంటీనియా,బ్రెజిల్, స్పెయిన్ జట్లు ఫిపా కప్‌ను కైవశం చేసుకుంటాయని భావించారు. ఎందుకంటే ఆదేశాల్లో ఫుట్‌బాల్ ఆటకున్న క్రేజ్...ఇప్పటి వరకూ అవే జట్లు ప్రపంచ చాంపియన్ కప్‌లను దక్కించు కోవడంతో పాటు...రన్నరప్‌గా నిలుస్తూ వచ్చాయి. దీనికి తోడూ అద్భుతమైన ఫుట్‌బాల్ ప్లేయర్లు ఈజట్లలోనే ఉండడం కలిస్తోందని అందరూ ఉహించారు. జర్మన్ జట్టులో మార్టిస్ వోస్, అర్జెంటీయా జట్టులో లియోనల్ మెస్సీ, బ్రెజిల్ జట్టులో నియామార్ వంటి ఆటగాళ్లు ఆటను మలుపు తిప్పగలరని భావించారు.
కానీ, అందరి ఉహాలు తలకిందులైయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావించినవన్నీ... ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఆట తీరును ప్రదర్శించలేక బోల్తా పడిపోయారు. ఫలితంగా ఫిపా వరల్డ్ కప్ నుంచి దారుణంగా ఈజట్లు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉహకందని విధంగా క్రోయేషియా, ఫ్రాన్స్ జట్లు ఫైనల్ వరకు దూసుకురావడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. క్రోయేషియా జట్టులో ముఖ్యంగా.. మంచుకిచ్, పెరిసిన్,లుక మాడ్రిక్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరును కనబర్చి ఆదరహో అనిపించారు. క్రోయేషియాను ఫైనల్‌కు వరకు చేర్చడంలో ఈఆటగాళ్లే ప్రముఖ పాత్ర వహించారు. ఇక ఫ్రాన్స్ జట్టు కూడా తమ టీం స్ఫూర్తిని చాటి చెప్పింది. గ్రీజ్మన్, పోగ్బా ఎంబపె వంటి ఆటగాళ్లు జట్టులో తమ సత్తా చాటి కప్ ఆదేశ వశమైయ్యేట్లు చేశారు. ఫలితంగా 4-2 గోల్స్ డాతో క్రొయేషియాపై ఫ్రాన్స్ విజయం సాధించి కప్‌ను కైవశం చేసుకుంది.
మొత్తానికి టైటిల్ పోరులోనే లేని జట్లు ప్రపంచ ఉత్తమ ఫుట్ జట్లుగా నిలువడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. ఇక పసికూనగా చెప్పుకొనే క్రొయేషియా ఐతే ఫైనల్ చేరుకోవడం ఈటోర్నీకే ప్రత్యేకమని చెప్పుకోవాలి. అయితే టీంలో ఆటగాళ్ల చేసిన చిన్న చిన్న తప్పిదాలు చేసి కప్‌ను చేజార్చుకున్నప్పటికీ...రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలే పొందుతుంది క్రొయేషియా.